ఈ కోర్సులో తెలుగు భాష పరిచయం, అక్షరమాల, అచ్చులు, హల్లులు, గుణింతాలు, ద్వితాక్షరాలు, సంయుక్తాక్షరాలు, అభ్యాసాలు, పదలేఖనం, రెండక్షరాల పదాలు, మూడక్షరాల పదాలు, నాలుగక్షరాల పదాలు, సర్వనామాలు, గేయాలు, పాటలు, చిలక పలుకులు ఉంటాయి. ప్రతి పాఠం పూర్తయిన తరువాత విద్యార్థికి కొన్ని ప్రశ్నలను ఇచ్చి రాయించడం జరుగుతుంది.
ఈ కోర్సులో తెలుగు భాష పరిచయం, అక్షరమాల, అచ్చులు, హల్లులు, గుణింతాలు, ద్వితాక్షరాలు, సంయుక్తాక్షరాలు, అభ్యాసాలు, పదలేఖనం, రెండక్షరాల పదాలు, మూడక్షరాల పదాలు, నాలుగక్షరాల పదాలు, సర్వనామాలు, గేయాలు, పాటలు, చిలక పలుకులు ఉంటాయి. ప్రతి పాఠం పూర్తయిన తరువాత విద్యార్థికి కొన్ని ప్రశ్నలను ఇచ్చి రాయించడం జరుగుతుంది.
దేశవిదేశాలలో తెలుగు భాష, విశేషణాలు, నామ విశేషణాలు, క్రియాజన్య విశేషణాలు, సంఖ్యా విశేషణాలు, గుణ విశేషణాలు, ప్రశ్నార్థక క్రియా విశేషణాలు, పద వ్యవస్థ (నామాలు, క్రియలు, ఇతర భాషా భాగాలు ప్రాతిపదికలో మారేవి, మారనివి), విభక్తి ప్రత్యయాలు, తద్ధితాలు, పదబంధాలు, ధ్వన్యనుకరణ శబ్దాలు, పద నిర్మాణ విధానాలు (ధాతువులో మార్పుకు లోనయ్యేవి, లోను కానివి), కాలబోధక ప్రత్యయాలు, లింగ వచన, పురుష ప్రత్యయాలు, విశేషణాలు, క్రియా విశేషణాలు, పద నిర్మాణం, వాక్య నిర్మాణం, సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, ఆచార వ్యవహారాలు, పండుగలు, సంప్రదాయాలు, ఉత్సవాలు, తెలుగు వీర వనితలు, తెలుగు సంఘ సంస్కర్తలు, యుగకర్తలు, తెలుగు సాహిత్య పరిచయం (రాయప్రోలు, గురజాడ, శ్రీశ్రీ) తెలుగు పద్యాలు (వేమన, శతక పద్యాలు), జానపద సాహిత్యం, తెలుగు ఛందస్సు, తెలుగు సామెతలు ఈ సంవత్సరం బోధించడం జరుగుతుంది. ప్రతి పాఠం పూర్తయిన తరువాత విద్యార్థికి కొన్ని ప్రశ్నలను ఇచ్చి రాయించడం జరుగుతుంది.
లిపి, తెలుగు సంస్కృతి, తెలుగువారి కళలు, ఆంధ్రదేశంలో వృత్తులు, తెలుగు మత సంప్రదాయాలు, తెలుగువారి చరిత్ర, తెలుగు భాష, ఆంధ్రప్రదేశ్ భౌగౌళిక స్వరూపం, సంగీతం, నృత్యం, చిత్ర లేఖనం, జాతీయోద్యమం, తెలుగు జాతికి విదేశీయుల సేవ, కవిత్రయం, పోతన ` శ్రీనాథుడు, ప్రబంధ కవులు, సాహిత్య ప్రక్రియలు ` ఉద్యమాలు, తెలుగు వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు, అమెరికాలో తెలుగు రచయితలు, అమెరికా రచయితల తెలుగు భాషా సేవ, భారతదేశంలో తెలుగువారు వంటి విషయాలను ఈ కోర్సులో బోధిస్తారు. ప్రతి పాఠం పూర్తయిన తరువాత విద్యార్థికి కొన్ని ప్రశ్నలను ఇచ్చి రాయించడం జరుగుతుంది.
సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి చెందిన ఈ తరుణంలో సాంకేతిక పరికరాలతో సులువుగా తెలుగును నేర్చుకునేందుకు, నేర్పించేందుకు ‘పాఠశాల’ టీమ్ ‘ఇ-లెర్నింగ్’ సౌకర్యాన్ని మీ దగ్గరకు తీసుకు వచ్చింది.
పాఠశాల విద్యార్థులు ఇ-లెర్నింగ్ ద్వారా మరింత సులువుగా, వేగంగా కోర్సును పూర్తి చేసేందుకు వీలవుతుంది. తరగతి గదుల్లో నేర్చుకోవడంతోపాటు వాటిని మరింత క్షుణ్ణంగా, సులువుగా గ్రహించేందుకు ఈ ఇ-లెర్నింగ్ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుంది.
పాఠశాలలో టీచర్లు చెప్పే చదువుతోపాటు ఇంట్లోనే ఆ చదువును కొనసాగించేందుకు మా ‘ఇ-లెర్నింగ్’ సహాయపడుతుంది. కోర్సుకు అవసరమయ్యే పుస్తకాలను చదవడంతోపాటు ఆన్‌లైన్ ద్వారా మీకు మరిన్ని విషయాలను సులభంగా తెలియజేసేందుకు పరస్పరం సంభాషించడం జరుగుతుంది.
క్విజ్‌లు వంటి ద్వారా మరిన్ని పదాలను నేర్పించడం, వర్క్‌షీట్‌లతో మీ మెడదుకు పదును పెట్టి మిమ్మల్ని మెరుగైన విద్యార్థిగా చేసేందుకు మా ఇ-లెర్నింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. మీకు ఈ సౌకర్యం కావాలనుకుంటే మీరు మీ పేరును పాఠశాలలో రిజిష్టర్ చేసుకోవాలి.
అప్పుడు మీకు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లను అందజేస్తారు.
తద్వారా మీరు ఈ సౌకర్యాన్ని పొందేందుకు వీలవుతుంది.
పాఠశాల వలంటీర్లు కూడా టీచర్ల మార్గదర్శకత్వంలో ఆన్‌లైన్‌లో తెలుగు భాషను బోధించవచ్చు. ఇ-లెర్నింగ్ ఇప్పుడు ఐఫోన్ మొబైల్స్‌లో కూడా చూడవచ్చు. ఐపాడ్, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కూడా సులభంగా లభ్యమవుతుంది.