Register
View Demo
పాఠశాల బోధన పద్ధతి
- కాలిఫోర్నియాలోనాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ 501 సి (3) సర్టిఫికెట్ పొందిన 'పాఠశాల ఇంక్' గత మూడేళ్ళుగా చిన్నారులకు తెలుగు భాషను సులభంగా నేర్పించేందుకు 'పాఠశాల'ను వివిధ కేంద్రాల్లో ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తోంది.
- ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ పాఠశాల ప్రయత్నాలను గుర్తించి భాగస్వామి గా చేసుకొని 4 సంవత్సరాల తెలుగు కోర్స్ ని ప్రపంచం లోని తెలుగు వారికి పాఠశాల ద్వారా అందిస్తోంది.
- ఎన్నారై పిల్లలు తెలుగును సులభంగా నేర్చుకునేందుకు, వారికి అనుగుణంగా ఉండేలా కోర్సులను ఎంపిక చేయడం జరిగింది.
- 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు వీలుగా తెలుగు పలుకు, తెలుగు అడుగు, తెలుగు పరుగు, తెలుగు వెలుగు ఉంటాయి.
- కేవలం బే ఏరియా ( CA ) లో 5 సంవత్సరాలలోపు చిన్నారులకు ప్రత్యేకంగా 'తారంగం తారంగం' అనే కోర్స్ కూడా వున్నది.
- ప్రతి తరగతి కి 2 టెక్స్ట్ పుస్తకాలు ఉంటాయి.
- ప్రతి సంవత్సరం చివరలో పరీక్షలు ఉంటాయి.
- 2 వ . 4 వ సంవత్సరం చివర ( తెలుగు అడుగు & తెలుగు వెలుగు ) జరిగే పరీక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విధ్యా శాఖ ఆద్వర్యం లో జరుగు తాయి.
- ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి.
పాఠశాల అడ్మిషన్ నియమనిబంధనలు :
- పాఠశాల నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంస్థ కాబట్టి, ఆర్థిక వ్యవహరాల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. అందువల్ల చిన్నారుల తల్లితండ్రులు తమ చిన్నారుల ఫీజులను పే పాల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.
- ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చెల్లించేటప్పుడు పూర్తి వివరాలను అందించకపోతే దానికి పాఠశాల బాధ్యత వహించదు. ఒకవేళ ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చెల్లించలేని పక్షంలో తల్లితండ్రులు తమ చిన్నారుల పూర్తి వివరాలతో దరఖాస్తును నింపి చెక్ ద్వారా కూడా పేమెంట్స్ చెల్లించవచ్చు.
- ఉత్తర అమెరికాలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. జూన్ వరకు జరుగుతాయి. మీరు చెల్లించే ఫీజులు ఒక్క సంవత్సరానికి మాత్రమే చెల్లుతుంది.
- పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి కోర్సుకు సంబంధించిన టెక్స్ట్‌బుక్స్‌ను అందించడం జరుగుతుంది.
- ప్రతి విద్యార్థి ఇ లెర్నింగ్‌కు సంబంధించిన శిక్షణకు అర్హుడు. పాఠశాల బోధనను ఆన్‌లైన్ ద్వారా కూడా ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు.
- ప్రతి విద్యార్థి పాఠశాల టైమింగ్స్‌ను విధిగా పాటించాలి. పాఠశాల కేంద్రాల నిర్వాహకులు, టీచర్లు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. క్లాస్‌వర్క్‌లోనూ, హోమ్‌వర్క్‌లోనూ టీచర్ల నుంచి సలహాలను సూచనలను పొందవచ్చు.
- ప్రతి వారం, ప్రతి నెలా జరిగే టెస్టులకు విద్యార్థులు హాజరై పరీక్షలు రాయాలి. మార్కుల ప్రాతిపదికగానే విద్యార్థికి పై తరగతులకు వెళ్ళేందుకు అర్హత లభిస్తుంది.
- పాఠశాల కేంద్రాల నిర్వహణకు అవసరమైన వలంటీర్లకోసం లేదా, టీచర్ల నియామకం వంటి విషయాల్లో చిన్నారుల తల్లితండ్రులు సహకారాన్ని అందించవచ్చు.
- తమ చిన్నారులు చదువుతున్న పాఠశాలలో కనీసం ఓ సెమిస్టర్ ఎగ్జామ్స్‌లోనైనా తల్లితండ్రులు వలంటీర్‌గా ఉండాలని కోరుకుంటున్నాము.
- పాఠశాల వీలైనంతవరకు తమ చిన్నారులను ఇతర సాంస్కృతిక ప్రదర్శనలలో, ఇతర ఈవెంట్స్‌లలో పాలుపంచుకునేలా కృషి చేస్తుంది. ప్రోత్సహిస్తుంది కూడా.
- వివిధ నగరాల్లో ఉన్న పాఠశాల కేంద్రాలు ప్రతి సంవత్సరం 'వసంతోత్సవం' పేరుతో వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో విద్యార్థుల టాలెంట్‌ను బయటపెట్టేలా ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంటారు..
- పాఠశాల కేంద్రాలకు సంబంధించినంతవరకు టీచర్లు, సెంటర్ కో ఆర్డినేటర్లు, ఏరియా డైరెక్టర్ల నిర్ణయాలే అంతిమం. ఇందులో ఇతర ఆలోచనలకు, మాటలకు తావు లేదు.
రీఫండ్స్‌కు సంబంధించి :
- పాఠశాల మేనెజ్‌మెంట్ ప్రతి కోర్సుకు ఆయా కేంద్రాలను బట్టి తగిన ఫీజును నిర్ణయిస్తుంది. ఈ ఫీజులనే తల్లితండ్రులు కట్టాల్సి ఉంటుంది.
- ఒక్కసారి ఫీజు చెల్లించిన తరువాత వాటిని వెనక్కి ఇవ్వడం కుదరదు. సహేతుకమైన కారణాలను వివరించి ఫీజులను వాపసు చేయాల్సిందిగా కోరినప్పుడు పాఠశాల మేనెజ్‌మెంట్ దానిపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటుంది.
- విద్యార్థుల తల్లితండ్రులు పూర్తి ఫీజును అడ్మిషన్ సమయంలోనే చెల్లించాలి.
- విద్యాసంవత్సరం ప్రారంభమైన 7 రోజుల లోపుగా ఫీజు వాపసు చేయాల్సి వస్తే కేవలం 35 డాలర్లు తగ్గించి ఫీజు వాపసు చేయబడుతుంది.
- 30 రోజుల తరువాత ఫీజుల వాపసుకు సంబంధించి వినతులను పరిశీలించడం జరగదు.
- ఫీజులు వాపస్ చేయాలని కోరుకునే తల్లితండ్రులు పాఠశాల నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాము.