ప్ర ) రిజిష్టర్ చేసుకోకుండానే మేము పోటీల్లో పాల్గొనవచ్చా?
జ ) రిజిష్టర్ చేసుకోవడమే మంచిది. ఎందుకంటే పోటీలకు ఎంతమంది హాజరవుతారన్న విషయమై నిర్వాహకులకు అవగాహన ఉంటుంది. దానికి తగ్గట్టుగా వారు ఏర్పాట్లు చేస్తారు.
ప్ర ) ప్రాంతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఏదైనా ఫీజులు చెల్లించాలా?
జ ) ఫీజులు లేవు. ఉచితంగానే ఈ పోటీల్లో మీరు పాల్గొనవచ్చు.
ప్ర ) జాతీయస్థాయి పోటీలకు ఎలా ఎంపిక చేస్తారు?
జ ) వివిధ నగరాల్లో జరిగే పోటీల్లో దాదాపు ఐదుగురిని ఎంపిక చేసి జాతీయస్థాయిలో జరిగే పోటీలకు పంపడం జరుగుతుంది.
ప్ర ) వర్జీనియాలో జరిగే ఫైనల్ పోటీలకు ఎంపికైన వారికి ప్రయాణభత్యం , వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారా?
జ ) లేదు. చిన్నారుల తల్లితండ్రులే తమ ఖర్చుతో పిల్లలను సెమిఫైనల్, ఫైనల్ పోటీలకు తీసుకురావాలి. వారే వసతి సౌకర్యాలను కూడా చూసుకోవాలి.
ప్ర ) పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే ఈ పోటీలు పరిమితమా?
జ ) లేదు. అమెరికాలో ఉన్న తెలుగు మాట్లాడే పిల్లలంతా ఇందులో పాల్గొనవచ్చు.
ప్ర ) నమూనా ప్రశ్నాపత్రాలు ఇస్తారా?
జ ) పాఠశాల వెబ్‌సైట్‌లో ఈ నమూనా ప్రశ్నాపత్రాలు దొరుకుతాయి.