దేశభాషలందు తెలుగు లెస్స... దేశభాషల్లో తెలుగు భాషకు ఉన్న ప్రశస్తిని అలనాడే శ్రీ కృష్ణదేవరాయలు చెప్పారు. తరతరాల పురా వైభవ చరిత్రలో చారిత్రకంగా, ఘనమైన వారసత్వాన్ని సంపాదించుకున్న తెలుగు జాతి వైభవాన్ని మన చిన్నారులకు నేర్పించడానికి 'పాఠశాల' కృషి చేస్తోంది.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలను పురస్కరించుకుని పాఠశాల-తానా కలిసి అమెరికాలోని తెలుగు చిన్నారులకు తెలుగు భాషపై పోటీలను నిర్వహిస్తోంది. తెలుగు పోటీలు పేరుతో నిర్వహించే ఈ పోటీలను రెండు విభాగాలుగా విభజించి వివిధ నగరాల్లో జరుపుతోంది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు తానా మహాసభల్లో జరిగే సెమి ఫైనల్‌, ఫైనల్‌ పోటీలకు అర్హులవుతారు.

తెలుగు పలుకు

వినండి... రాయండి..
  • 6-10 సంవత్సరాల తెలుగు పిల్లలు దీనికి అర్హులు
  • పరీక్షా హాలులో 25 తెలుగు పదాలు విని, వాటిని రాయాలి
  • 25 తెలుగు పదాలు సరిగా రాసినవారికి 50 మార్కులు వేస్తారు
  • ఎక్కువ మార్కులు సాధించిన మొదటి ఐదుగురు సెమీఫైనల్ లో పాల్గొంటారు

తెలుగు వెలుగు

ప్రశ్నలకు జవాబు ఇవ్వండి
  • 11-15 సంవత్సరాల తెలుగు పిల్లలు అర్హులు
  • పరీక్షా హాలులో 25 మార్కులకై రూపొందించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి/రాయాలి
  • ప్రశ్నలు తెలుగు భాష, సంస్కృతి, ఆచారాలు, తెలుగు ప్రముఖులు, ప్రాంతాల మీద ఉంటాయి
  • ఎక్కువ మార్కులు సాధించిన మొదటి ఐదుగురు సెమీఫైనల్ లో పాల్గొంటారు

బహుమతులు

  • పాల్గొన్న అందరికి సర్టిఫికెట్స్
  • గెలిచినవారికి ప్రశంశా పత్రాలు, ట్రోఫీ , గిఫ్ట్ లు
  • ప్రాంతీయ స్థాయిలో జరిగే తెలుగు పలుకు, తెలుగు వెలుగు పోటీల్లో పాల్గొని విజేతలైన ఐదుగురు వాషింగ్టన్‌డీసీలో జరిగే 22వ తానా మహాసభల్లో జరిగే సెమీఫైనల్స్ / ఫైనల్స్ లో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు.
  • జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విజేతలు, వారి తల్లితండ్రులు లేదా సంరక్షకులు తమ సొంత ఖర్చులతో వాషింగ్టన్‌ డీసిలో జరిగే సెమీఫైనల్‌, ఫైనల్‌ పోటీలకు రావాలి. తానా లేదా పాఠశాల వారికి ఎలాంటి రానుపోనూ ఛార్జీలు, ఇతర అలవెన్స్‌లు ఇవ్వవు.
  • ప్రతి ఏరియాలో జరిగే పోటీల్లో ఎక్కువ మార్కులు సాధించిన ఐదుగురు వాషింగ్టన్‌ డీసిలో జరిగే సెమీఫైనల్‌ పోటీలకు అర్హులవుతారు. ఒకవేళ ఎంపికైన ఐదుగురిలో ఎవరైనా సెమీఫైనల్‌ పోటీలకు హాజరుకాకపోతే వారి తరువాత స్థానంలో ఉన్నవారిని ఈ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది.
  • ప్రాంతీయ పోటీలకన్నా సెమీఫైనల్‌, ఫైనల్‌ పోటీలు కొంచెం కఠినంగా ఉండవచ్చు.
  • సెమీపైనల్‌ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి సర్టిఫికెట్‌, ట్రోపీ, గిఫ్ట్‌ కార్డ్‌ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్‌ పోటీల్లో విజేతలుగా ఉన్నవారికి సర్టిఫికెట్‌, ట్రోపీ, గిప్ట్‌కార్డ్‌ ఇవ్వడం జరుగుతుంది.
  • తెలుగు పోటీల్లో పాల్గొనేవారికి తానా కాన్ఫరెన్స్‌ తరపున లభించే ప్రయోజనాలను త్వరలో ప్రకటిస్తాము.
రిజిస్ట్రేషన్