ఆశయం

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు ప్రపంచంలోనే ఉత్తమమైన లక్షణాలను అలవర్చుకునేలా తీర్చిదిద్దటం పాఠశాల లక్ష్యం.

అమెరికాలోనూ, విదేశాల్లోనూ ఉన్న చిన్నారులకు తెలుగు భాషను క్రమపద్ధతిలో నేర్పించడంతోపాటు శాస్త్రీయంగా అక్షరాలను అభ్యసించేలా పాఠశాల బోధన ఉంటుంది.

తొలుత చిన్నారులకు తెలుగు భాషపై ఇష్టాన్ని పెంచడం, నేర్చుకోవాలన్న తపనను కలిగించడం చేస్తాము.

యూనివర్సిటీ అనుమతించిన సిలబస్‌ ప్రకారం చిన్నారులకు తెలుగు భాషను నేర్పించి వారు తెలుగులోనే రాయగలిగేలా, మాట్లాడేలా తీర్చిదిద్దటం చేస్తాము.

అమెరికాలో ఉన్న మన చిన్నారులను వీకెండ్‌ క్లాస్‌లకు పంపించడం వల్ల వారు సులభంగా మాతృభాషను నేర్చుకోవడంతోపాటు మరో భాషను మేము నేర్చుకున్నామన్న ఆత్మవిశ్వాసాన్ని వారిలో కలిగించడం మనందరి కర్తవ్యం.