Register View Demo


"బే ఏరియా లోనే పాఠశాల పుట్టిందని, 6 సంవత్సరాలుగా విజయ వంతం గా నడిచిన పాఠశాల ఇప్పుడు 7 వ విద్యా సంవత్సరం లోకి అడుగు పెడుతోంది. బే ఏరియా తెలుగు సంఘం ఆద్వర్యం లో ఇక్కడ జరిగే పాఠశాల అందరికి మార్గ దర్సకం గా ఉంది. ఫ్రీమాంట్, సాన్ రామన్, డబ్లిన్, సన్నీవేల్, సాన్ హోసే, మిల్పిటాస్ పట్టణాలలో పాఠశాల తరగతులు ప్రారంభం కావటం చాల సంతోషం గా వుంది." అని పాఠశాల సీఈఓ చెన్నూరి సుబ్బా రావు ఇవాళ ఫ్రీమాంట్ లో పాఠశాల తరగతులకు వచ్చిన పిల్లలు, వారి తల్లి తండ్రులతో అన్నారు.
"పాఠశాల కొత్త సాంవత్సరం లోకో అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, పాఠశాల ని ప్రోత్సహిస్తున్న తల్లి తండ్రులకు అభినందనలు" అన్నారు పాఠశాల డైరెక్టర్ శ్రీ ప్రసాద్ మంగిన.
"పాఠశాల నిన్న మొన్ననే ప్రారంభం అయ్యిందా అని పించినా, మా పిల్లలు తెలుగు నేర్చు కొని మాట్లాడటం చూస్తే పాఠశాల గొప్ప తనం తెలుస్తోంది : అని కళ్యాణ్ కట్టమూరి అన్నారు.
ఫ్రీమాంట్ లో పాఠశాల కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ వేడుకకు వీరు ఉప్పా ల, రమేష్ కొండా, శ్రీదేవి పసుపులేటి , రామ దాసు పులి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల పిల్లలు మొదటగా 'సరస్వతి నమస్తుభ్యం' పద్యం తో కొత్త సంవత్సరానికి ప్రారంభం చెప్పారు.



బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా), తెలుగు టైమ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'పాఠశాల' వసంతోత్సవ వేడుకలు మే 11వ తేదీన శాన్‌రామన్‌లోని ఐరన్‌ హార్స్‌ మిడిల్‌ స్కూల్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 500 మందికి పైగా అతిధులు, పాఠశాల విద్యార్థులు, తల్లితండ్రులు హాజరయ్యారు. ఐదుగంటల పాటు ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పాటలు, పద్యాలు, నాటికలు, డ్యాన్స్‌లు తదితర కార్యక్రమాలను ప్రదర్శించారు. వేడుకలు జరిగిన ప్రాంతాన్ని అందంగా అలంకరించారు. స్వాగత్‌ ఇండియన్‌ కుజిన్‌వారు వచ్చినవారందరికీ భోజనాన్ని వడ్డించారు. ఈ వేడుకల్లో తానా-పాఠశాల నిర్వహిస్తున్న తెలుగు పోటీలు కూడా జరిగాయి. ఈ పోటీల్లో 40 మందికిపైగా చిన్నారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచినవారు వాషింగ్టన్‌ డీసిలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే తానా మహాసభల వేదికపై జరిగే ఫైనల్‌ పోటీల్లో పాల్గొంటారు. డా. గీతామాధవి, పద్మశొంఠి, శ్రీదేవి ఎర్నేని, కళ్యాణి తదితరులు చిన్నారులకు పరీక్షలు నిర్వహించారు. విజేతలకు తానా నాయకులు సతీష్‌ వేమూరి, వెంకట్‌ కోగంటి సర్టిఫికెట్లను, ట్రోఫీని బహూకరించారు.

పాఠశాల అకడమిక్‌ డైరెక్టర్‌ డా రమేష్‌ కొండ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీచర్లు, కో ఆర్డినేటర్ల కృషి వల్ల బే ఏరియాలోని పాఠశాలలో ప్రతి సంవత్సరం 300 మందికి పైగా విద్యార్థులు చేరుతున్నారని చెప్పారు. పాఠశాల కరికులమ్‌ డైరెక్టర్‌ డా. గీతామాధవి, మాట్లాడుతూ, యుఎస్‌లోని చిన్నారుల కోసం ప్రత్యేకంగా కరికులమ్‌ తయారు చేయడం జరిగిందని చెప్పారు. టీచర్లు, తల్లితండ్రులు ఈ కరికులమ్‌పై అభిప్రాయాలను ఇస్తే వాటిని సమీక్షించి సరిచేస్తామని తెలిపారు. పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ మంగిన మాట్లాడుతూ, పాఠశాల ముఖ్య ఉద్దేశ్యం తెలుగు భాషను సులభంగా బోధించి నేర్పించడమేనన్నారు. తెలుగు మాట్లాడటంలో కష్టంగా కాకుండా ఇష్టంగా మాట్లాడేలా చేయడం పాఠశాల ఆశయమని తెలిపారు.

పాఠశాల వివిధ కేంద్రాల్లో చదువుకుంటున్న పిల్లలు నాటికలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. గుణపాఠం (శాన్‌హోసె సెంటర్‌), ఐకమత్యమే మహాబలం (డబ్లిన్‌ అడుగు చిన్నారులు), కృష్ణ వెనమాత్మ కథ (ఫ్రీమాంట్‌ పరుగు), చదువుకుంటే బాగుపడతాం (శాన్‌రామన్‌ సెంటర్‌), మామా తెలుగు (ఫ్రీమాంట్‌ సెంటర్‌), డబ్లిన్‌, ఫ్రీమాంట్‌ (వెలుగు) స్టూడెంట్స్‌ నిర్వహించిన అష్టావధానం వంటి కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. బాటా కమిటీ సభ్యులు, వలంటీర్లు పాఠశాలకు సంబంధించి తల్లితండ్రులు అడిగిన సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పాఠశాల రిజిస్ట్రేషన్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. పాఠశాల ఇ-లెర్నింగ్‌పై అవగాహన కల్పించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, పాఠశాల విజయవంతంగా 6వసంతాలను పూర్తి చేసుకోవడం?ఆనందంగా ఉందని, ఇందుకు పాఠశాల టీచర్లు, కో ఆర్డినేటర్లు, బాటా నాయకత్వమే కారణమని ప్రశంసించారు. బాటా సలహాదారు విజయ ఆసూరి తొలుత అతిధులకు, ఇతరులకు ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల టీమ్‌ అంకితభావంతో చేస్తున్న కృషిని అభినందించారు. తరువాత గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం సందడిగా జరిగింది. టీచర్లు, చిన్నారులు ప్రశంసాపత్రాలను అతిధుల చేతుల మీదుగా అందుకున్నారు.

బాటా వైస్‌ ప్రెసిడెంట్‌ హరినాథ్‌ చికోటి మాట్లాడుతూ, పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బాటా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా బాటా కమిటీని ఆయన అందరికీ పరిచయం చేశారు. యశ్వంత్‌ కుదరవల్లి (ప్రెసిడెంట్‌), సుమంత్‌ పుసులూరి (సెక్రటరి), కొండల్‌రావు (ట్రెజరర్‌), అరుణ్‌ రెడ్డి (జాయింట్‌ సెక్రటరీ), స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్‌ మల్ల, కళ్యాణ్‌ కట్టమూరి, శిరీష బత్తుల, కల్చరల్‌ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారకదీప్తి, లాజిస్టిక్స్‌ టీమ్‌ సభ్యులు హరి సన్నిధి, వరుణ్‌ముక్కా తదితరులను ఆయన పరిచయం చేశారు. ఈ వేడుకలను విజయవంతం చేసినందుకు బాటా అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ అందరినీ అభినందించారు.

బే ఏరియాలోని పాఠశాల టీచర్లు, కో ఆర్డినేటర్ల వివరాలు - డబ్లిన్‌లో సరస్వతీరావు, వందన, రజిత కె రావు, ఇష వరకుర్‌, శరత్‌ పోలవరపు, ఫ్రీమాంట్‌లో సునీత రాయపనేని, పద్మ విశ్వనాధ, లావణ్య అరుగొంద, దీపిక బిహెచ్‌ఎస్‌, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పులి, మిల్‌పిటాస్‌లో సింధు, హరి సన్నిధి, శాన్‌హోసెలో శ్రీకాంత్‌ దాశరథి, మూర్తి వెంపటి, ఛాయాదేవి పొట్లూరి, శాన్‌రామన్‌లో శ్రీదేవి ఎర్నేని, కళ్యాణి చికోటి, సత్య బుర్ర, శాన్‌రామన్‌లో పద్మ శొంటి, ఉమ, సువర్ణ?జొన్నలగడ్డ, శ్రీధర్‌ కొడవలూరు, సురేష్‌ శివపురం, ధనలక్ష్మీ, ఉదయ్‌ ఈయుణ్ని.


కొలంబస్ ఒహయో లో పాఠశాల డైరెక్టర్ శ్రీ కాళీ ప్రసాద్ మావులేటి నిర్వాహణలో, ఆ పట్టణం లో వున్నా తానా నాయకుల సహాయ సహాకారాలతో "పాఠశాల తానా తెలుగు పోటీలు 2019" శనివారం మే 4 వ తేదీ న మొదలు అయ్యాయి. వచ్చే వారం నుంచి వరసగా ఒకటి లేదా రెండు చోట్ల ఈ పోటీల నిర్వాహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక చోట్ల నుంచి పోటీలు నిర్వహించటానికి ముందుకు వస్తున్న పాఠశాల, తానా మరియు తెలుగు అభిమానులకు మా ధన్యవాదాలు. ఈ పోటీలు నిర్వహించటానికి కొన్ని వివరాలు ఇస్తూ ఎక్కువ చోట్ల జరపటానికి మేము సిద్ధం గా ఉన్నామని అందరికి పాఠశాల తానా ల తరుపున తెలియ చేస్తున్నాం.

1. మీ ప్రాంతం లో తెలుగు చిన్నారుల కోసం ఈ పోటీలు నిర్వహించాలనుకొనే వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి.
www.paatasala.net/telugupoteelu
2. మీరు పోటీలు జరపటానికి ఒక ప్లేస్ (ఓ స్కూల్ గాని, ఓ టెంపుల్ గాని, ఓ ఆఫీస్ గాని), ఒక తేదీ (జూన్ చివరి వరకు వున్న శని లేదా ఆదివారం లలో) నిర్ణయించి మాకు తెలియ చేయండి. 
3. పాఠశాల, హైదరాబాద్ ఆఫీస్ వెంటనే మీ వూరికి తెలుగు పోటీల పోస్టర్ ని, పాంఫ్లెట్ ని, ఈ ఫ్లయర్ ని తాయారు చేసి పంపుతుంది. అలా వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ తో పబ్లిసిటి మొదలు పెట్టటమే! ఈ ఫ్లయర్ ని FB ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇమెయిల్ ద్వారా మీ ఊరిలోని అన్ని గ్రూప్ లకు పంపి ఎక్కువ మంది పిల్లలు రిజిస్టర్ అయ్యేలా చేయండి. 
4. హైదరాబాద్ నుంచి పోటీలలో పాల్గొనే సర్టిఫికెట్స్, గెలిచిన వారికి ఇచ్చే ట్రోపీలు, కావలిసిన ఫ్లెక్స్ బ్యానెర్లు అన్నిమీకు పంప బడుతాయి.

తెలుగు భాష కి అభిమాని గా, తానా సభ్యుని గా మీరు మీ ఊరి పిల్లల తెలుగు భాష నైపుణ్యాన్ని గుర్తించేలా చెయ్యండి.



నాగ్‌పూర్‌లోని ఆంధ్ర ఆసోసియేషన్‌ నిర్వహిస్తున్న తెలుగు పాఠశాల తరగతులు ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా వసంతోత్సవం నిర్వహించారు. జనవరి 6వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి ఎం.చంద్రశేఖర్‌, పాఠశాల వ్యవహారాలను చూస్తున్న మేనేజర్‌ ఎం.సంధ్యరెడ్డి, పాఠశాల టెక్స్ట్‌బుక్స్‌ రచయిత సుషుమ్న రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పార్వతీ కల్యాణం హరికథ వచ్చినవారిని ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాల ద్వారా తెలుగు నేర్చుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం సుషుమ్న మాట్లాడుతూ పిల్లలు తెలుగు పదాలను అర్థం చేసుకుని క్రమం తప్పకుండా మాట్లాడాలని అప్పుడే భాషలో పరిపూర్ణతను సాధించగలరన్నారు. ఇంట్లో కూడా తెలుగు మాట్లాడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఆంధ్ర అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌. మురళిధర్‌, ప్రధాన కార్యదర్శి పి.ఎస్‌.ఎన్‌.మూర్తి, సమన్వయ కర్త పి.టి.శర్మ అతిథులను సన్మానించారు.

మన మాతృభాష తెలుగును మన చిన్నారులకు నేర్పించే బాధ్యతను ప్రతి ఎన్నారై తెలుగు కుటుంబం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఇంట్లో కూడా తెలుగులోనే మాట్లాడటం ద్వారా వారికి మాతృభాషపై మమకారం కలిగేలా చూడాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వారు 'పాఠశాల' ద్వారా ప్రవేశపెట్టిన తెలుగు పలుకు కోర్స్‌ ఆన్‌లైన్‌ వర్షన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రసంగించారు. అమెరికాలోని చిన్నారులకు తెలుగును నేర్పిస్తున్న 'పాఠశాల'ను ఆయన అభినందించి ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా కూడా తెలుగు బోధనను చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇందువల్ల మరింతమందికి తెలుగు భాషను నేర్చుకునే సౌకర్యం కలిగిందన్నారు. ఎపి ప్రభుత్వం అందిస్తున్న తెలుగు పలుకు కోర్సును ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా నేర్చుకోవాలని కోరారు.


పాఠశాల చైర్మన్‌ జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, అమెరికాలో గత నాలుగేళ్ళుగా చిన్నారులకు తెలుగు భాషను 'పాఠశాల' నేర్పిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఎపి ప్రభుత్వంతో కలిసి తెలుగు పలుకు కోర్స్‌ను చిన్నారులకు నేర్పిస్తున్నట్లు చెప్పారు. పాఠశాల వైస్‌ చైర్మన్‌ ప్రసాద్‌ గారపాటి మాట్లాడుతూ, పాఠశాల ఇప్పుడు నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ గుర్తింపును కూడా కలిగి ఉందని చెప్పారు. ప్రపంచంలోని ఎన్‌ఆర్‌ తెలుగు కమ్యూనిటీకి తెలుగు భాషను బోధించడమే తమ లక్ష్యమని చెప్పారు.

పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, నేటి తరం చిన్నారులు సులభంగా తెలుగును నేర్చుకునేలా కొత్త సిలబస్‌తో అచ్చుపుస్తకాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త సిలబస్‌ ప్రకారం ఇ-లెర్నింగ్‌ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పారు. తెలుగు భాషను క్రమపద్ధతిలో నేర్పించడంతోపాటు శాస్త్రీయంగా అక్షరాలను అభ్యసించేలా బోధన ఉంటుందని చెప్పారు. Learning - Speaking - Reading- Writing పద్ధతిలో మా బోధన ఉంటుందని చెప్పారు. తొలుత భాషను తెలుసుకోవడం, తరువాత మాట్లాడటం, చదవడం, రాయడం వంటివి చేయిస్తామని తెలిపారు. Forsys Inc కంపెనీ ప్రస్తుతం పాఠశాలకు టెక్నాలజీ పార్టనర్‌గా వ్యవహరిస్తోందని, ఆన్‌లైన్‌ కోర్సుల నిర్వహణ వ్యవహరాలను చూస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యురాలు విజయ ఆసూరి కూడా పాల్గొన్నారు.