ఈ-లెర్నింగ్‌

సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి చెందిన ఈ తరుణంలో సాంకేతిక పరికరాలతో సులువుగా తెలుగును నేర్చుకునేందుకు, నేర్పించేందుకు ‘పాఠశాల’ టీమ్‌ ‘ఇ-లెర్నింగ్‌’ సౌకర్యాన్ని మీ దగ్గరకు తీసుకు వచ్చింది. పాఠశాల విద్యార్థులు ఇ-లెర్నింగ్‌ ద్వారా మరింత సులువుగా, వేగంగా కోర్సును పూర్తి చేసేందుకు వీలవుతుంది. తరగతి గదుల్లో నేర్చుకోవడంతోపాటు వాటిని మరింత క్షుణ్ణంగా, సులువుగా గ్రహించేందుకు ఈ ఇ-లెర్నింగ్‌ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుంది. పాఠశాలలో టీచర్లు చెప్పే చదువుతోపాటు ఇంట్లోనే ఆ చదువును కొనసాగించేందుకు మా ‘ఇ-లెర్నింగ్‌’ సహాయపడుతుంది. కోర్సుకు అవసరమయ్యే పుస్తకాలను చదవడంతోపాటు ఆన్‌లైన్ ద్వారా మీకు మరిన్ని విషయాలను సులభంగా తెలియజేసేందుకు పరస్పరం సంభాషించడం జరుగుతుంది. క్విజ్‌లు వంటి ద్వారా మరిన్ని పదాలను నేర్పించడం, వర్క్‌షీట్‌లతో మీ మెడదుకు పదును పెట్టి మిమ్మల్ని మెరుగైన విద్యార్థిగా చేసేందుకు మా ఇ-లెర్నింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. మీకు ఈ సౌకర్యం కావాలనుకుంటే మీరు మీ పేరును పాఠశాలలో రిజిష్టర్‌ చేసుకోవాలి. అప్పుడు మీకు యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్ లను మీకు అందజేస్తారు. తద్వారా మీరు ఈ సౌకర్యాన్ని పొందేందుకు వీలవుతుంది. పాఠశాల వలంటీర్లు కూడా టీచర్ల మార్గదర్శకత్వంలో ఆన్‌లైన్‌లో తెలుగు భాషను బోధించవచ్చు. ఇ-లెర్నింగ్‌ ఇప్పుడు ఐఫోన్‌ మొబైల్స్‌లో కూడా చూడవచ్చు. ఐపాడ్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో కూడా సులభంగా లభ్యమవుతుంది.